1892లో లండన్ లో సెయింట్ థామస్ హాస్పిటల్ నిర్వహించే వైద్యవిద్యాలయంలో విద్యార్థిగా చేరాడు మామ్. ఆంగ్ల, ఫ్రెంచ్, ఇటాలియన్ సాహిత్యాలు చరిత్ర, విజ్ఞానశాస్త్రం చదువుతూ, ఏకాంకికలు వ్రాస్తూ గడిపేవాడు ఆరోజుల్లో. ఆనాటకాలను, రంగస్థల నిర్వాహికులు స్వీకరించలేదు. రెండు, మూడు నవలలు వ్రాసి పేరుతెచ్చుకుంటే తప్ప, నాటకాలు చలామణి కావని భావించి, రెండు నవలికలు వ్రాశాడు. ఫిషర్ అంవిన్ అనే ప్రచురన సంస్థ వీటిని స్వీకరించలేదు. వెంటనే నవలలు ప్రారంభించాడు. హాస్పిటల్ ప్రసూతిశాఖ గుమాస్తాగా, మురికిపేటలు సందర్సించి 63 పురుళ్ళు పోసిన అనుభవం గడించాడు. బీదల జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించే అవకాశమూ అప్పుడే కలిగింది. కాయకష్టంపై బ్రతికే బీదల్ని గురుంచి ఆర్ధర్ మారిసన్ అనేఆయన వ్రాసిన్ నవల- చైల్ద్ ఆఫ్ ది జాగో జనాన్ని ఆకర్షించింది. కల్పన చేయకుండా తను విన్నదీ, చూసినదీ డాక్టర్ రోగిని పరిశేలించేవిధంగా వ్రాసి పూర్తి చేసిన మొదటి నవల లిజ్ ఆఫ్ లాంబెత్ . 1897 అక్టోబరులో ఈనవల వెలువడింది. లీజా అనే బీద కన్య పాపకార్యాలు చేసి చనిపోతుంది. పశ్చాత్తాపం పడదు. పాపానికి ఫలితం మృత్యువు అన్నధ్వని ఈనవలలో లేదు. నీతిపాఠాలు ఉండవు. పాత్రల అంతరంగ భావల చిత్రీకరణ లేదు. భావగర్భితమైన ఉద్రేక ప్రకర్షఉండదు. ఈనవల పాఠకుల్ని ఆకర్షించింది. సమీక్షలుకూడా ప్రోత్సాహకరంగా వచ్చాయట. సంప్రదాయ సాహితీవేత్త ఎడ్మండ్ గాస్ కూడా ఈనవలను ముచ్చుకున్నాడట. పదేళ్ళు జరిగి చాల రచనలు చేసి పేరుతెచ్చుకున్న గాస్ మామ్ ను బాగాప్రోత్సహించ ఇంకా మంచిరచనలు చేయమన్నారు. ఆరోజుల్లోనే తాను గమనించిన వింతలనూ, విన్న చమత్కారభావాలను నోటుబుక్కులో వ్రాసుకోవడం మొదలెట్టాడు. ఆయన 78వయేటికి ఇవి 15నోటుపుస్తకాలయ్యాయి.వీటిని సంక్షిప్త పరిచి రచయిత నోట్ బుక్ గా వెలువరించాక ఆయన కొత్తరచనలేవీ చేయలేదు.
విలియం సోమెర్సెట్ మామ్ రచించిన మొదటి నవల పేరు ఏంటి?
Ground Truth Answers: లిజ్ ఆఫ్ లాంబెత్లిజ్ ఆఫ్ లాంబెత్లిజ్ ఆఫ్ లాంబెత్
Prediction: